శనగలు ఉడికించి తినడం అనేది మామూలుగా తినేదే.. అయితే నూనెలో వేయించిన శనగలు ఇంకా రుచిగా ఉంటాయి. వీటికి మసాలా జోడించి తీసుకుంటే నోటికి రుచిగా ఉండటమే కాదు. ఆరోగ్యానికి కూడా మంచిదే.
బెర్రీలను, వాల్ నట్స్ తో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
స్వీట్ పొటాటో సన్నని ముక్కులు చేసి, ఆలివ్ నూనెలో కలిపి తీసుకుంటే రుచిగా ఉంటాయి.
సిట్రస్ పండ్లలో నారింజ, ద్రాక్ష, దానిమ్మ పండ్లు ఆరోగ్యానికి మంచి సపోర్ట్ నిస్తాయి.
కోకో డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇక దీనికి బాదం కలిపి తీసుకుంటే ఆరోగ్యంతో పోటు మంచి రుచి కూడా తోడవుతుంది.
క్యారెట్, దోసకాయ, బెల్ పెప్పర్, రంగురంగుల కూరగాయలన్నీ కలిపి తీసుకోవడం చూడడానికి అందమైన లుక్ ఇస్తుంది. అలాగే మంచి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ ఫుడ్ అందినట్టే..
వోట్మీల్ చక్కెర లేకుండా తీసుకుంటే సాయంత్రాలు కడుపులో వెచ్చని ఫీలింగ్ ఉంటుంది. దానితో పాటు ఆరోగ్యానికి కూడా మంచి సపోర్ట్‌గా నిలుస్తుంది.