సొరకాయ రసం ఆరోగ్యానికి ఒక వరం..

ఆయుర్వేదం ప్రకారం సొరకాయ ఎన్నో ప్రయోజనాలనిస్తుందని నిపుణులు చెబుతున్నారు  

ప్రతి ఒక్కరు ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు.

బరువు తగ్గాలనుకుంటే ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో సొరకాయ రసం తాగండి. ఇందులో కేలరీలు, కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది

సొరకాయలో పీచు, అలాగే 98 శాతం నీరు పుష్కలంగా ఉంటుంది. అందుకే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉండటం వల్ల గుండె ఆగిపోవడం, గుండెపోటు, వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

 నెలల పాటు నిరంతరం సొరకాయ రసం సేవిస్తే కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉండి గుండెకు సంబంధించిన అన్ని వ్యాధులు దరిచేరవు.

 అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సొరకాయ జ్యూస్ చాలా సహాయపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)