రాగి సంగటి, నాటు కోడి కలిపి తింటే..  ఇన్ని లాభాలా..?

రాగి సంగటి, నాటు కోడి కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఈ రెండింటిలో ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

రాగి పిండిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నాటు కోడిలో కాల్షియం, ఐరన్ తదితర ఖనిజాలు ఉంటాయి. ఇవి కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో రాగి ఉపయోగపడుతుంది. ఇందులో పీచు పదార్థం.. ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

ఈ రెండింటిలోని పోషకాల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నాటు కోడిలో యాంటీ బయోటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. రాగి పిండిలోని పోషకాలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. 

జీర్ణక్రియ సమస్యలతో ఇబ్బంది పడే వారికి రాగి సంగటి బాగా ఉపయోగపడుతుంది. రాగిలోని ఫైబర్.. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.

వీటిలోని పోషకాలు.. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడతుంది. దీని వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు సైతం బలంగా తయారవుతుంది.

రాగిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. వీటిని కలిపి తినడం వల్ల ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది.

ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా రాగి సంగటి, నాటు కోడి బాగా ఉపయోగపడుతుంది.