ప్రీ గ్రౌండ్ కాఫీ పొడిలో కేవలం బొద్దింకలు మాత్రమే కాదు. ఇతర పురుగుల అవశేషాలు ఉంటాయి.

పెద్ద మొత్తంలో కాఫీ గింజల్ని స్టోర్ చేసి, ప్రాసెస్ చేసే సమయంలో కాఫీ కలుషితం అవుతుంటుంది. 

పురుగులు చేరి గింజల మధ్యలోనే చనిపోతూ ఉంటాయి. ఆ అవశేషాలు అందులోనే మిగిలిపోతూ ఉంటాయి. 

కలుషితం కాకుండా కాఫీ పొడి తయారు చేసి అమ్మటం కంపెనీలకు అసాధ్యమైన పని. 

అందుకే ఎఫ్‌డీఏ కూడా కొంత శాతం పురుగుల కలుషితాన్ని స్వాగతిస్తుంది. 

పురుగులతో కలుషితం అయినప్పటికీ బాగా వేడి చేసి తాగుతుండటం వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. 

కాఫీ పౌడర్ కంటే.. గింజల్ని కొనుక్కుని పొడి చేసుకుని తాగటం మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

బ్రాండెడ్ కంపెనీ కాఫీ పొడి కొంటే కలుషితం శాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.