జలుబు, ఫ్లూ, సైనస్ ఇన్ఫెక్షన్లు,  దీర్ఘకాలిక అలర్జీల వల్ల ముక్కు దిబ్బడ ఏర్పడితే,

శ్వాస తీసుకోవడానికి నోరు తెరవాల్సి వస్తుంది.

దవడ మధ్యలో ఉండే ఎముక వంగి ఉండటం

పెద్ద టాన్సిల్స్  అడినాయిడ్స్ వంటివి ముక్కు ద్వారా గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి.

వెల్లకిలా పడుకున్నప్పుడు, గురుత్వాకర్షణ వల్ల దవడ కిందికి జారి,

నాలుక వెనక్కి వెళ్లి గాలి మార్గాన్ని అడ్డుకోవచ్చు, దీంతో నోరు తెరవడం సులభం అవుతుంది.

నిద్రలో శ్వాస అప్పుడప్పుడు ఆగిపోయే ఈ సమస్య ఉన్నప్పుడు, గాలి కోసం శరీరం నోరు తెరుస్తుంది.

చిన్నతనంలో ముక్కు దిబ్బడ వల్ల మొదలైన నోటి శ్వాస, సమస్య తగ్గిన తర్వాత కూడా అలవాటుగా కొనసాగవచ్చు.

పెదవులు, దవడ, నాలుక కండరాలు బలహీనంగా ఉండటం వల్ల 

నిద్రలో నోరు తెరుచుకోవచ్చు, ముఖ్యంగా వృద్ధులలో ఇది కనిపిస్తుంది.

నోటిలోని లాలాజలం ఆరిపోవడం వల్ల నోరు ఎండిపోయి, దుర్వాసన, దంతక్షయం, చిగుళ్ళ వ్యాధులు రావచ్చు.

నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల గురక పెరిగే అవకాశం ఉంది.

దీర్ఘకాలం నోటితో శ్వాస తీసుకోవడం వల్ల ముఖ ఆకృతిలో మార్పులు రావచ్చు.

మీరు తరచుగా నోరు తెరిచి నిద్రపోతుంటే, కారణాన్ని తెలుసుకోవడానికి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.