గోరు వెచ్చని నీటితో ఆర్థరైటీస్ సమస్యలకు చెక్..!

తాగే నీటిని వేడి చేయడం వల్ల అందులో కంటికి కనిపించని క్రిములు, కీటకాలు నశిస్తాయి. దాంతో జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటి అంటు వ్యాధులు దరిచేరవు. 

చల్లని వాతావరణంలో గోరువెచ్చటి నీరు తాగితే.. శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. దాంతో బద్దకం తగ్గి యాక్టివ్‌గా మారతాం. చలి, వణుకు లాంటి లక్షణలు ఏమైనా ఉంటే ఇట్టే తగ్గిపోతాయి.

అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు రోజు వేడి నీరు తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరికి బరువు తగ్గుతారు.

ఆడవాళ్లకు నెలసరిలో వచ్చే అనేక సమస్యలు గోరువెచ్చటి నీళ్లతో పరిష్కారమవుతాయి. ఆ సమయంలో కలిగే విసుగు అలసట తగ్గుతాయి.

పీరియడ్స్ టైమ్‌లో వచ్చే కడుపు నొప్పి నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. మొటిమలు రావు. చుండ్రు రాదు. జుట్లు రాలదు, కుదుళ్లు బలపడతాయి.

వేడి నీళ్లతో అవయవాలన్నీ ఉత్తేజితమవుతాయి. జీర్ణప్రక్రియను వృద్ధి చేసి మలబద్ధక సమస్యను నివారిస్తుంది. కడుపునొప్పి, అజీర్తి సమస్యలు తగ్గుతాయి.

వేడినీళ్లు తాగితే.. నరాల పనితీరు మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. శరీరంలో మలినాలన్నీ వెళ్లిపోతాయి.

వేడి నీళ్లు తాగితే పంటిలో క్రిములు చచ్చిపోయి దంత సమస్యలు తగ్గుతాయి.

కీళ్ల నొప్పులతో బాధపడేవారు వేడి నీళ్లు తాగితే.. ఆర్థరైటీస్ సమస్యలు తగ్గుతాయి. శరీరం పొడి బారదు. ముఖం కాంతివంతంగా ఉంటుంది.