చలికాలంలో శరీరానికి వేడి అవసరం ఎక్కువగా ఉంటుంది. చల్లని పానీయాలు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి.

ఐస్‌క్రీమ్ చాలా చల్లగా ఉండటం వల్ల గొంతులో కఫం పెరిగి ఇన్ఫెక్షన్లు వచ్చే  అవకాశం ఉంటుంది.

చలికాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది. ఫ్రిజ్ ఫుడ్  తినడం వల్ల అజీర్తి,  కడుపు నొప్పి సమస్యలు కలుగుతాయి.

నూనెలో వేయించిన ఫుడ్స్ జీర్ణం కావడం కష్టం. ఇవి శరీరంలో అలసటను పెంచుతాయి.

చక్కెర ఎక్కువగా తీసుకుంటే ఇమ్యూనిటీ బలహీనమై జలుబు, దగ్గు త్వరగా వస్తాయి.

మసాలా ఎక్కువగా ఉండే ఆహారం గొంతులో మంట, కడుపు సమస్యలకు కారణమవుతుంది.

 ద్రాక్ష, నారింజ లాంటి పండ్లు చల్లని గుణం కలిగి ఉండి కఫాన్ని పెంచుతాయి.