రక్త ప్రసరణ శరీరం అంతా సక్రమంగా ఉంటే అన్ని అవయవాలకు పుష్కలంగా ఆక్సిజన్ అందుతుంది. ముఖ్యంగా మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.

  మీ శరీరంలో రక్తం శాతం తక్కువగా ఉన్నా.. రక్త ప్రసరణ సక్రమంగా లేకపోయినా ఇబ్బందులు తప్పవు.

 మంచిగా రక్తం పట్టాలన్నా.. ప్రసరణ సజావుగా సాగాలన్నా కొన్ని ఆహార పదార్థాలను మీ రోజు వారి డైట్ లో చేర్చేసుకోవాలి.

దానిమ్మ పండు.. ఈ పండ్లలో పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు, నైట్రేట్లు అధికంగా ఉంటాయి. దీని వల్ల రక్త ప్రసరణ  మెరుగుపడుతుంది.

బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు వంటి యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి.

 బచ్చలికూర రక్త ప్రసరణలో సహాయపడతాయి. ఇందులో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త నాళాలను విశాలం చేస్తాయి

నారింజ, ద్రాక్ష, నిమ్మకాయలు విటమిన్‌ సికి పెట్టింది పేరు. రక్త నాళాల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

 రక్త ప్రసరణ మెరుగుపరచడంలో పుచ్చకాయ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

దాల్చినచెక్క.. దీనిలో కూడా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడి, రక్త నాళాలకు నష్టం జరగకుండా కాపాడుతుంది.