ప‌ర్పుల్ క‌ల‌ర్ క్యాబేజీ.. చూడటానికి సాధారణ క్యాబేజీలా ఉన్నా రంగులోనూ, రుచిలోనూ ఇది చేదుగా ఉంటుంది.

ఆకుపచ్చ రంగు క్యాబేజీ కంటే, మధుమేహం ఉన్నవారు ఊదా రంగు క్యాబేజీ  తినడం మంచిదంట.

ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉండే క్యాబేజీలో అనేక విట‌మిన్లు ఉంటాయి. ఈ క్యాబేజీలో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతోపాటు చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది.

ప‌ర్పుల్ క‌ల‌ర్ క్యాబేజీలో క్యాల్షియం కూడా అధికంగానే ఉంటుంది. ఇది ఎముక‌ల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

అధిక బరువు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది ఉత్తమ ఆహారం. ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ ఎక్కువ కాలం కడుపు నిండుగా ఉంచుతుంది.

 కీళ్ల నొప్పుల వంటి సమస్యలతో బాధపడుతున్నారో, వారు తమ డైట్‌లో ఊదా రంగు క్యాబేజీ చేర్చుకోవడం చాలా మంచిదంట.

 గుండె సమస్యలతో బాధపడుతున్నవారు తమ ఆహారంలో ప‌ర్పుల్ క‌ల‌ర్ క్యాబేజీని చేర్చుకోవడం వలన ఇది గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.