అల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ కొంతమందికి కొన్ని పరిస్థితుల్లో  అనారోగ్యాన్ని కలుగుజేస్తుంది.

కొన్ని ఆరోగ్య పరిస్థితుల రీత్యా అల్లాన్ని దూరంగా పెట్టాలి.

గర్భధారణ సమయంలో అల్లం తినడం సురక్షితం కాదని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరికీ వర్తించదు, కాబట్టి వైద్యుడిని సంప్రదించడం మంచిది.

అల్లం కారం లేదా ఇతర కారణాల వల్ల అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తే, అల్లం తినడం మానేయాలి.

రక్త సంబంధిత సమస్యలు  ఉంటే అల్లం తీసుకోవడం మానుకోవాలి.

బాగా సన్నగా వున్నవారు అల్లాన్ని చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలని నిపుణులు చెప్తారు.