వాము నీరు రోజూ తాగడం వల్ల ఇన్ని లాభాలా..
వాము జీర్ణశక్తిని పెంచుతుంది. అందుకే పిల్లలు, పెద్దలు ఈ నీటిని తాగుతారు.
వీటిలో కాల్షియం, ఇరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ తదితర ఖనిజాలు ఉంటాయి.
ఎటువంటి జీర్ణ సమస్య అయినా వాము నీటి ద్వారా పరిష్కారమవుతుంది.
వాము గింజలను క్యారమ్ సీడ్స్, అజ్వైన్ అని పిలుస్తారు.
వాము నీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఈ నీటిని తాగడం వల్ల అజీర్ణం, ఉబ్బరం, అపాన వాయువు నుంచి ఉపశమనం లభిస్తుంది.
గ్యాస్ట్రిక్ రసాలను ప్రేరేపించి.. ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహకరిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరచడం.. జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడంలో వాము కీలక పాత్ర పోషిస్తుంది.
శ్వాసకోస ఇబ్బందులు సైతం దీని వల్ల దూరమవుతాయి.
వాములో థైమోల్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి.
శ్వాసకోస సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు.. దగ్గు, జలుబు, ఆస్తమా లక్షణాలను తగ్గించేందుకు వాము నీరు సహకరిస్తుంది.
Related Web Stories
ఈ నూనె చేసే మేలు తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే
ఎర్ర తోటకూరతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?
అల్యూమినియం పాత్రల్లో ఇన్నేళ్లకు మించి వండితే.. ఈ సమస్యలు రావడం పక్కా..
వీటిని నీళ్లల్లో నానబెట్టి తింటున్నారా..?