ఎర్ర తోటకూర వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ఈ ఆకు కూర.. కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. పేగు  ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఇది ఎర్ర రక్త కణాలను  ఉత్పత్తి చేస్తుంది.

బీపీ నియంత్రణలో సహాయపడుతుంది.

ఈ కూర శిశువులకు సైతం మంచిది. ఇందులోని పోషకాలు, విటమిన్లు కారణంగా.. నవ జాత శిశువుల్లో న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడంలో సహాయపడుతుంది.

ఈ ఆకు కూరలో విటమిన్ ఏ, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఉపిరితిత్తులు,  నోటీ క్యాన్సర్‌ను నివారిస్తుంది.

అంటు వ్యాధుల నుంచి రక్షిస్తుంది. మెదడు ఆరోగ్యానికి మంచిది. ఎముకను బలంగా ఉంచడంలో తోడ్పడుతుంది.