భోజనం తర్వాత నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
భోజనం తర్వాత నడవడం వల్ల గుండెపోటు ప్రమాదం 40శాతం వరకు తగ్గుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర పెరగడం వల్ల ఇన్సులిన్ పెరుగుతుంది. ఇది ధమనులలో వాపునకు దారితీస్తుంది.
నడవడం ద్వారా చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వచ్చి వాపు తగ్గుతుంది. తద్వారా గుండెపోటుకు కారణమయ్యే ఆక్సీకరణ ఒత్తిడి ప్రమాదం కూడా తొలగిపోతుంది.
భోజనం తర్వాత నడవడం వల్ల గుండెపోటుకు కారణమయ్యే ట్రైగ్లిజరైడ్‌లు రక్తం నుండి తొలగిపోతాయి.
నడవడం వల్ల రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ అనే పదార్థం విడుదలవుతుంది. ఇది ధమనుల గోడల నుండి విడుదలై, రక్త నాళాలను వెడల్పు చేస్తాయి.
తిన్న తర్వాత వచ్చే నిద్ర, మగత తగ్గుడంతో పాటూ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇది చక్కెర మరియు ఇన్సులిన్ పెరగడం వల్ల సంభవిస్తుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ద్రాక్ష పండ్లను ఎక్కువగా తింటే ఎలాంటి హాని జరుగుతుందో తెలుసా?
శీతాకాలం వచ్చేసింది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
పల్లీలు, నువ్వులు... కలిపి తింటే జరిగేది ఇదే
ఆలివ్ ఆయిల్‌తో ఆ సమస్యకు చెక్..