మనం ఎక్కువగా వంటలలోకి నల్ల మిరియాలను ఉపయోగిస్తుంటాం. మన భారతీయ వంటలలో నల్ల మిరియాలకే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తుంటారు.
కానీ తెల్ల మిరియాలు తినడం వలన కూడా చాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
తలనొప్పిని తగ్గించడంతోపాటు.. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ తెల్ల మిరియాలు ఎంతో సహాయపడతాయి.
ఇందులో ఉండే క్యాప్సైసిన్ కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అంతేకాదు.. క్యాన్సర్ ను తగ్గించేందుకు సహాయపడతాయి.
ఇవి దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి. రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.
రక్త హీనతతో బాధపడే వారు వీటిని తప్పనిసరిగా తమ డైట్‌లో చేర్చుకోవాలంట. దీని వలన శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
కంటి ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మేలు చేస్తాయి. తెల్ల మిరియాల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంది, అందువలన ఇవి తినడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది.
తెల్ల మిరియాలు మీ ఆహారంలో చేర్చుకోవడం వలన ఇవి సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. శరీరానికి తక్షణ శక్తినిస్తాయి.