లివర్ సమస్యలు ఉంటే ఏం తినాలి?  ఏం తినకూడదు?

ఫైబర్ అధికంగా ఉండే ఆకుకూరలు, క్యారెట్, ఆపిల్, బొప్పాయి, దుంపలను ఎంచుకోండి. కాలేయంలోని విషం తొలగిపోతుంది.

బ్రౌన్ రైస్, ఓట్స్, తృణ ధాన్యాల్లో కార్బొహైడ్రేట్లు, ఫైబర్ పుష్కలం. ఇవి తింటే కాలేయంలో కొవ్వు పేరుకుపోదు. మైదా, తెల్లరొట్టె మాత్రం నివారించాలి.

కాయధాన్యాలు, టోఫు, చికెన్, చేపలు, గుడ్డు తెల్లసొనలో లీన్ ప్రొటీన్లు ఎక్కువ. ఇవి కాలేయ కణాలను మరమ్మతు చేస్తాయి.

ఆహారంలో ఒమేగా-3 అధికంగా ఉండే వాల్ నట్స్, అవిసె గింజలు, సాల్మన్ చేపలు వంటివి చేర్చుకుంటే కాలేయ వాపు, ఫ్యాటీ లివర్ సమస్యలు రావు.

తరచూ కొబ్బరినీరు తాగితే కాలేయం సమర్థవంతంగా శరీరంలోని విషకారకాలను బయటికి పంపగలదు. హైడ్రేటెడ్ గానూ ఉంటారు.

ఆల్కహాల్ నేరుగా కాలేయ కణాలను విషపూరితం చేస్తుంది. కాబట్టి, తక్షణమే ఈ అలవాటు నివారించండి.

పకోడీలు, సమోసాలు, ఫాస్ట్ ఫుడ్స్, వేపుళ్లు కాలేయంలో కొవ్వును పెంచుతాయి. నయమవడం కష్టం. బదులుగా కాల్చినవి, ఆవిరిలో ఉడికించినవి తినండి.

స్వీట్లు, కూల్ డ్రింక్స్, డెజర్ట్స్,  చక్కెర కలిపిన పండ్ల రసాలకు దూరంగా ఉండండి. లేదంటే ఇన్సులిన్ నిరోధకతను ప్రోత్సహిస్తాయి.

రెడ్ మీట్ లో సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ అధికం. లివర్ సమస్య ఉన్నవారికి మరింత ప్రమాదకరం. 

చిప్స్, ఇన్ స్టంట్ నూడుల్స్, ప్రాసెస్ చేసిన మాంసం నివారించండి. వీటిలో సోడియం అధికం. ఇవి కాలేయంపై భారం పెంచుతాయి.