రక్త హీనతను అరికట్టే రసం..

క్యారెట్ రసం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఈ జ్యూస్ లో ప్రోటీన్, పిండి పదార్థాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు  సమృద్ధిగా ఉంటాయి.

క్యారెట్ జ్యూస్‍లో ఉండే విటమిన్ ఏ, ల్యూటిన్, జియాక్సంతిన్, కాంతి వల్ల కళ్ళు దెబ్బతినకుండా కాపాడుతాయి. ఇతర కంటి సమస్యలు దరిచేరవు.

ఇది రోగ నిరోధక వ్యవస్థని పెంచడంలో సహాయపడతుంది.

క్యారెట్ జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. కాబట్టి.. డయాబెటిక్ రోగులకు ఇది మంచి ఎంపిక.

ఈ జ్యూస్‌లో ఉండే విటమిన్ సీ. చర్మానికి రక్షణ కల్పిస్తుంది. 

క్యారెట్ జ్యూస్ లోని విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు రక్తహీనతను నివారించడంలో సహాయపడతాయి.