నెయ్యి.. రక్తపోటును నియంత్రిస్తుందా..?

ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాల్లో నెయ్యి ఒకటి.

దీనిలో విటమిన్ ఏ, డీ, ఈ, కేలతోపాటు పోషకాలు సైతం పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉంటుంది.

నెయ్యి.. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. 

శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. చర్మ సంరక్షణలో సహాయపడుతుంది. జుట్టుకు పోషకాలు అందిస్తుంది.

రక్తపోటును నియంత్రించడంతోపాటు గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో ఉపయోగపడుతుంది.

నెయ్యిని మితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. 

నెయ్యితో పాటు తేనె, టీ, కాఫీలు, చేపలు, పెరుగు, ముల్లంగి తీసుకోకూడదంటారు.  

నెయ్యి తినడం వల్ల శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. 

నెయ్యి తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా.. కాంతివంతంగా ఉంటుంది. ముఖం అందంగా కనిపిస్తుంది. చర్మం మీద ముడతలు తగ్గుతాయి.  జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 

నెయ్యి ఎముకల దృఢత్వాన్ని, బలాన్ని, శక్తిని పెంచుతుంది. శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన ఎంజైమ్‌లు ఉదర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

నిపుణుల సూచన మేరకు రోజుకు 2 నుంచి 3 చెంచాల నెయ్యి తినడం మంచిదని సూచిస్తున్నారు.