కిడ్నీలు దెబ్బతింటే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..?
శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. కిడ్నీలు శరీరంలోని వ్యర్థాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. తద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
మూత్రపిండాలు క్రమంగా క్షీణించడం ప్రారంభించినప్పుడు, శరీరం అనేక రకాల సంకేతాలను ఇస్తుంది..
కిడ్నీలో సమస్య వస్తే ముందుగా చీలమండలు ప్రభావితమవుతుంది. చీలమండ వాపు ప్రారంభమవుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యుని సలహా, సూచనలు తీసుకోవాలి.
చర్మంపై దురద, మంట, పొడిబారడం లేదా ఎర్రటి దద్దుర్లు వస్తాయి.
కిడ్నీలో ఏదైనా సమస్య వస్తే నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. పాదాలు ఉబ్బడం ప్రారంభిస్తాయి.
పొత్తి కడుపులో నొప్పి, అజీర్ణం, మూత్ర విసర్జనలో ఇబ్బంది, మూత్రంలో రక్తం కనిపించడం వంటివి కూడా కిడ్నీ సమస్యల లక్షణాలే..
మూత్రపిండాల సమస్యలను నివారించడానికి సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.
జంక్ ఫుడ్, ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. వాటిని అధికంగా నీరు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సి ఉంటుంది.