పచ్చి బాదం పప్పుతో ఇన్ని లాభాలా..

పచ్చి బాదం పప్పులు సైతం ఆరోగ్యానికి ప్రయోజనకరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

పచ్చి బాదం పప్పును నానబెట్టకుండా నేరుగా తీసుకోవచ్చు.

పచ్చి బాదంపప్పు తినడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చి బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేసి, శరీరంలోని pH స్థాయిని సమతుల్యం చేస్తాయి.

ఈ బాదంపప్పు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలోని ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

పచ్చి బాదం పప్పులను తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. ఇందులోని ఫైబర్, మినరల్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి.. గ్యాస్, ఎసిడిటీ సమస్యలను దూరం చేస్తాయి.

పచ్చి బాదంపప్పులోని ఫాస్ఫరస్, కాల్షియం ఎముకలని బలోపేతం చేస్తాయి. బోలు ఎముకల సమస్యను దూరం చేసి, ఎముకల సాంద్రతను  పెంచుతాయి.

పచ్చి బాదంపప్పు తినడం వల్ల రక్తంలోని షుగర్ స్థాయిలను నియంత్రించవచ్చు. తద్వారా మధుమేహం కూడా అదుపులో ఉంటుంది.