వెన్నునొప్పి వస్తుందా..  ఈ పొరపాట్లు చేయకండి..

 వెన్నునొప్పి అంటే వీపు భాగంలో కలిగే నొప్పి. ఇది కండరాలు, ఎముకలు, నరాలు, లేదా వెన్నుపాములోని ఇతర భాగాల నుండి రావచ్చు. 

 గంటల తరబడి కంప్యూటర్ ముందు వంగి కూర్చోవడం, సోఫాలో సరిగా కూర్చోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది.

ప్రతి 30-40 నిమిషాలకు లేచి కొంచెం నడవడం మంచిది.

రోజంతా కూర్చొని పని చేయడం వల్ల కండరాలు బలహీనపడతాయి. 

కనీసం రోజుకు కొన్ని నిమిషాలు యోగా, వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల మంచిది.

బరువులు ఎత్తేటప్పుడు వంగి ఎత్తడం, లేదా ఒక్కసారిగా ఎక్కువ బరువు మోయడం వల్ల వెన్నెముకకు నష్టం కలుగుతుంది.

 కింద ఉన్న వస్తువులను ఎత్తేటప్పుడు మోకాళ్లను వంచి, నెమ్మదిగా లేచే విధంగా ఎత్తాలి.