బ్లడ్ షుగర్ లెవెల్స్ 300కు పెరిగితే ఏం చేయాలి?

ఇన్సులిన్ లేదా డయాబెటిస్ కోసం టాబ్లెట్స్ వాడుతుంటే వైద్యుడి సూచనల ప్రకారమే మందులు తీసుకోండి. మోతాదుకు మించి వాడవద్దు.

రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గేవరకూ కార్బొహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం తినకండి. పొరపాటున తింటే పరిస్థితి మరింత దిగజారుతుంది.

టైప్ 1 డయాబెటిస్ లేదా వికారం, వాంతులు, కడుపు నొప్పి లక్షణాలుంటే మూత్రంలో కీటోన్లు చెక్ చేయండి.

అధిక కీటోన్లు+అధిక చక్కెర=డయాబెటిక్ కీటోయాసిడోసిస్(DKA). ఇది ప్రాణాంతక పరిస్థితి. తక్షణమే వైద్యం అవసరం.

నడక వంటి తేలికపాటి శారీరక శ్రమ రక్తంలో గ్లూకోజ్ తగ్గిస్తుంది. అనారోగ్యంగా అనిపిస్తే వ్యాయామం చేయవద్దు.

పుష్కలంగా నీరు తాగితే అదనపు గ్లూకోజ్ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. హైడ్రేట్ అవుతారు.