ఎండకాలం అనగానే ఎక్కువమందికి గుర్తొచ్చేవి తాటిముంజలు.
చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంతా సాఫ్ట్ గా, జ్యూసీ జ్యూసీగా అబ్బా చెబుతుంటేనే నోరూరిపోయే రుచి వాటిది.
తాటిముంజలు రుచినే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.ఆడవారి ముఖ్యంగా తినడం వల్ల చాలా లాభాలున్నాయి.
గర్భిణీలు ముంజలు తింటే త్వరగా జీర్ణం అవుతుంది.అలాగే తరచుగా ఎసిడిటీ, మలబద్ధకంతో బాధపడుతుంటే దాని నుంచి బయటపడటానికి ముంజలు సహాయపడతాయి.
కొత్తగా బిడ్డను కన్న స్త్రీలు తాటిముంజలు తింటే తల్లిపాలు బాగా వస్తాయని చెబుతారు. అంతేకాకుండా బిడ్డకు పోషకాలు బాగా అందుతాయి.
తాటిముంజలు తినడం ద్వారా ఆడవారిలో వైట్ డిశ్చార్జ్ సమస్య తగ్గుతుంది.
ముంజలో ఆంథోసైనిన్ అనే రసాయనం ఉండటం వల్ల ఇది ఆడవాళ్లకు వచ్చే రొమ్ము క్యాన్సర్ గడ్డలు రాకుండా అడ్డుకుంటుంది.
గర్భిణీలకు తాటిముంజలు మంచిదే అయినప్పటికీ వాళ్లు ఉదయం టిఫిన్ చేసిన తర్వాతే వాటిని తినాలి మధ్యాహ్నం ముంజలు తిననే కూడదని అని నిపుణులు చెబుతున్నారు
Related Web Stories
మందారం అంటేనే ఆరోగ్యం సౌభాగ్యం
ఖాళీ కడుపుతో వేపాకులు తింటే జరిగేదిదే
ఉప్పు కలిపిన టీ.. తాగితే ఏం జరుగుతుందో తెలుసా..
పల్లీలను పొట్టుతో తినటం వల్ల కలిగే లాభాలు తెలిస్తే..