వేపాకులు చేదుగా ఉంటాయి.కానీ వేపలో ఉండే ఔషద గుణాలు మాటల్లో చెప్పలేనివి.

తినగ తినగ వేము తియ్యనుండు అని వేమన తాత ఎప్పుడో వేప గురించి చెప్పాడు

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేపను నమలడం వల్ల మలబద్దకం సమస్య నుండి బయట పడవచ్చు.

వేపలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.ఇది మలబద్దకం సమస్యను పరిష్కరిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుకోవడానికి వేప ఆకులను తీసుకోవచ్చు.

వేపాకులను ఉదయం పూట ఖాళీ కడుపుతో తింటే డయాబెటిక్ రోగులకు చాలా మేలు జరుగుతుంది

అతి సర్వత్రా వర్జయేత్ అని అంటారు.అతిగా తింటే ఆరోగ్యకరమైనది కూడా అనారోగ్యానికి దారి తీస్తుంది. 

సరైన ఫలితాల కోసం వేపాకులను ఉదయాన్నే ఖాళీ కడుపుతో 4 నుండి 5 ఆకులు తినవచ్చు ఇవి  లేత ఆకులు తినాలి