గుడ్లలో ఉండే ప్రొటీన్ కండరాలను రిపేర్ చేయటంతోపాటు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది.

గుడ్లను తగిన మోతాదులో తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుడ్లు గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. 

గుడ్లలో కొలైన్ పుష్కలంగా ఉంటుంది. అది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

గుడ్డు పచ్చసోనలో ఉండే లూటైన్, జియాక్సాతిన్ కళ్లను బ్లూ లైట్ డ్యామేజీ నుంచి రక్షిస్తాయి.

బరువు తగ్గాలనుకున్నా.. అదుపులో ఉంచాలనుకుంటున్నా గుడ్లు మంచి ఛాయిస్ అవుతాయి.

2009 పరిశోధనల్లో ఏం తేలిందంటే.. ఉదయాన్నే గుడ్లను ఆహారంగా తీసుకునే వారు ఆ రోజంతా తక్కువ క్యాలరీలు తీసుకున్నారు.

గుడ్డులో బయోటిన్, విటమిన్ డీ, అమీనోయాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ యూవీ రేస్ కారణంగా పాడైన చర్మాన్ని రిపేర్ చేస్తాయి.