పొట్టు మినపప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు..
మినపప్పు అంటేనే పోషకాల గని. వీటిలో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి
మినపప్పు లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగు పరచుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
పొట్టు మినపప్పు, అనగా గింజ తొక్కు తొలగించకుండా ఉంచిన మినపప్పు. పొట్టు మినపప్పులో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మినప పప్పులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు.
ఈ పప్పు.. కిడ్నీల సంరక్షణకు మరింత మంచిది.ఇది బరువు తగ్గాలనుకునే కూడా మరింత మంచిది.
ఈ పప్పులోని పోషకాలు సన్ టాన్స్, మొటిమలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి
రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. దీనిలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, ఎముకల ఆరోగ్యానికి పెంపొందిస్తాయి.