క్యాన్సర్ నివారించే ఆకు కూర..

ఆకు కూరలు.. తోట కూర, పాల కూర, గోంగూర, చుక్క కూర ఇలా చాలానే ఉన్నాయి. అలాగే బచ్చలి కూర కూడా ఉంది. కానీ ఇది చాలా మందికి తెలియదు. ఇందులో చాలా రకాల పోషకాలుంటాయి.  

పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్లు ఏ, సీతోపాటు ఐరన్, బీటా కెరాటిన్ ఉంటాయి. ఈ ఆకు కూరలో నీటి శాతం అధికంగా ఉంటుంది.

ఆకలిని అరికట్టడం.. రోగ నిరోధకశక్తిని పెంచడం..గుండెను ఆరోగ్యంగా ఉంచడం.. శరీరానికి రక్షణగా నిలవడంలో ఈ ఆకు కూర బాగా పని చేస్తుంది.  

ఈ ఆకు కూర తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఇది ఎముక కణ జాలాన్ని తొలగించి..తిరిగి పునర్నిర్మిస్తుంది.

బోలు ఎముకల వ్యాధి రాకుండా ఈ ఆకు కూర నిరోధిస్తుంది.

ఇందులోని థైలాకోయిడ్ పదార్థం ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు బచ్చలి కూర తీసుకోవాలి.

రక్త హీనతతో బాధపడేవారు.. ఈ ఆకు కూర తీసుకుంటే ఆ సమస్య ఇట్టే పరిష్కారమవుతుంది.

బలహీనంగా.. తల తిరిగే సమస్యతో ఇబ్బంది పడే వారు బచ్చలి కూర తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

గర్బిణీలు ఈ ఆకు కూర తీసుకోవడం వల్ల జన్మించే శిశువు ఆరోగ్యంగా ఉంటాడు.

ఊపిరితిత్తులు సక్రమంగా పని చేయడంతోపాటు మెదడు, నరాల ఆరోగ్యం ఉండేందుకు దోహదపడుతుంది.

చర్మ సమస్యలు రాకుండా చేస్తుంది. 

చెడు కొలెస్ట్రాల్‌ కరిగిస్తుంది. 

క్యాన్సర్‌ని నివారిస్తుంది.