ఇయర్లీ స్టేజిలో థైరాయిడ్ క్యాన్సర్‌ను గుర్తించటం చాలా కష్టం. 

థైరాయిడ్ క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలు కొన్ని సార్లు బయటకు కనిపించకపోవచ్చు. ఈ లక్షణాలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి.

గొంతు వాచిపోయి ఉండటం. నొప్పి లేకుండా ఉండి .. రోజు రోజుకు వాపు పెరగటం.

ఊపిరి తీసుకోవటంలో, మింగటంలో ఇబ్బంది ఉండటం. 

తరచుగా గొంతు నొప్పి రావటం. కొన్ని సార్లు చెవులు, దవడలు కూడా నొప్పి తీయటం.

గొంతు భాగంలో లింఫ్ గ్రంథులు ఉబ్బిపోయి ఉండటం.

ఆడవాళ్లలో థైరాయిడ్ క్యాన్సర్ ఎక్కువగా వస్తూ ఉంటుంది.

ఫ్యామిలీ హిస్టరీలో థైరాయిడ్ క్యాన్సర్ ఉంటే తప్పని సరిగా వైద్యులను సంప్రదించాలి.