జీడిపప్పు రోజూ తింటే..
ఏం జరుగుతుందో తెలుసా?
జీడిపప్పులో ఉండే మోనో అన్ శాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలస్ట్రాల్‌ను పెంచుతాయి.
రోజూ జీడిపప్పు తింటే రక్తంలో ట్రై గ్లిజరాయిడ్స్, చెడు కొలస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
జీడిపప్పులో పుష్కలంగా ఉండే మెగ్నీషియం రక్త నాళాలను వ్యాకోచింపచేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె మీద ఒత్తిడిని తగ్గిస్తుంది.
జీడిపప్పులో పాలీఫినాల్స్, కెరటనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి.
జీడిపప్పులోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.
ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్ కావాలంటే జీడిపప్పు తినాల్సిందే.
జీడిపప్పులోని అమినో యాసిడ్స్ రక్త ప్రసరణ సజావుగా సాగేలా చేసి గుండెకు మద్దతుగా నిలుస్తాయి.
బరువును నియంత్రణలో ఉంచడానికి కూడా జీడిపప్పు సహాయపడుతుంది. జీడిపప్పు తినడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది.
Related Web Stories
ప్రతీరోజూ పచ్చి వెల్లుల్లి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఈ సమస్య ఉంటే టమోటాకు దూరంగా ఉండాల్సిందే
Blood Pressure: ఇంట్లోనే బీపీ చెక్ చేసుకుంటున్నారా? ఈ తప్పులు అసలు చేయకండి..
ప్రెగ్నెంట్ లేడీస్ జున్ను పాలు తాగొచ్చా?