ఇంట్లోనే బీపీ చెక్ చేసుకుంటున్నారా? ఈ తప్పులు అసలు చేయకండి..
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి బీపీ ఉంటుంది. దీంతో ఎవరికి వారు బీపీ మెషీన్‌ను కొనుగోలు చేసి ఇంట్లోనే చూసుకుంటున్నారు.
కొన్నిసార్లు మానిటర్‌లో బీపీని తప్పుగా చూపిస్తాయి. ఇలా ఎందుకు అవుతుందో చాలా మందికి అర్థం కాదు.
బీపీ చెక్ చేసుకొనేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.
ధరించిన దుస్తులపై బ్లడ్ ప్రెషర్ కఫ్ కట్టకపోవడమే మంచిది. ఒక వేళ అలా చేస్తే.. 5-5mmHg యూనిట్లు ఒత్తిడిని పెంచుతుంది.
అందువల్ల చేతిపై దుస్తులు తొలగించి చర్మంపై కఫ్ కట్టుకోవడం వల్ల బీపీ ఖచ్చితంగా వస్తుంది.
బీపీ కొలిచేటప్పుడు ప్రశాంతంగా కూర్చోవాలి. ఈ సమయంలో ఎక్కువ మాట్లాడకూడదు. అలా చేస్తే అనవసరమైన ఒత్తిడిని కలుగుతుంది.
బీపీ కొలిచేటప్పుడు.. కుర్చీపై కూర్చొని రెండు చేతులను టేబుల్‌పై ఉంచాలి. చేతులు, గుండె ఒకే స్థాయిలో ఉండే విధంగా ఉంచాలి.
బీపీ కొలిచేటప్పుడు కఫ్‌ను మోచేయికి 2.5 సెం.మీ పైకి కట్టాలి. చాలా వదులుగా.. గట్టిగా కట్టకూడదు.
బీపీ కొలిచే ముందు మూత్ర విసర్జన చేయాలి. బీపీ మానిటర్ వద్ద మొబైల్ లేదా ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉంచకూడదు.
బీపీ కొలిచే ముందు టీ, కాఫీ లేదా కెఫిన్ కలిగిన పానీయాలు తాగవద్దు.
రక్తపోటు కొలిచే ముందు కనీసం 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవాలి.
రక్తపోటు కొలవడానికి కనీసం అర గంట ముందు ఏమీ తినకూడదు. మద్యం సేవించడం కానీ.. పొగ త్రాగడం కానీ చేయకూడదు. ఇది బీపీలో ఆకస్మిక పెరుగుదలకు కారణమవుతుంది.
వ్యాయామం చేసిన వెంటనే బీపీ తనిఖీ చేయకూడదు. ఈ సమయంలో ఒత్తిడి అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇలా చేస్తే బీపీలో హెచ్చు తగ్గులు చూపిస్తుంది.
Related Web Stories
ప్రెగ్నెంట్ లేడీస్ జున్ను పాలు తాగొచ్చా?
చలికాలంలో రోజూ ఈ టీ తాగితే చాలు
మఖానా తినడానికి ఎంత మంచిదో అతిగా తింటే అంత చెడ్డది
కారం ఎక్కువ తింటే మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే.