ఈ వ్యక్తులు కందిపప్పుఅస్సలు  ముట్టుకోవద్దు!

పప్పుధాన్యాల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కందిపప్పు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం

ఎంతో రుచికరంగా ఉండే కందిపప్పులో పొటాషియం, విటమిన్ సి, బి6 ఐరన్, కాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి

కాని ఈ 5 సమస్యలు ఉన్న వ్యక్తులు పొరపాటున కూడా కందిపప్పు తినకూడదని నిపుణులు చేబుతున్నారు

 శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉన్నవారు కందిపప్పును తినకూడదు. కందిపప్పులో ప్యూరిన్లు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి, కీళ్ల నొప్పులు, వాపుకు దారితీస్తుంది.

కొంతమందికి కందిపప్పు తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఇందులో ఉండే ప్రోటీన్‌ను జీర్ణవ్యవస్థ జీర్ణం చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీనివల్ల గ్యాస్, అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి.

ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు పప్పు ధాన్యాలు తినకూడదని నిపుణులు అంటున్నారు.

 దీనికి కారణం పప్పు ధాన్యాలలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. కిడ్నీలు అదనపు పొటాషియంను సరిగ్గా ఫిల్టర్ చేయలేవు. ఇది వారి కిడ్నీలపై ఒత్తిడిని పెంచి కిడ్నీ రోగుల సమస్యను మరింత తీవ్రం చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.

పైన చెప్పిన ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే.. కందిపప్పును పూర్తిగా తినకుండా ఉండటమే ఉత్తమం. ఇతర పప్పుధాన్యాలు తినాలనుకున్నా, చాలా పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.