బంగాళాదుంపలు ఎక్కువ రోజులు ప్రెష్‌‌గా ఉండటానికి కెమికల్స్‌ను వాడుతున్నారు. వాటిపై ఆర్టిఫిషియల్ కోటింగ్ వేస్తున్నారు.

నకిలీ బంగాళాదుంపల్ని తినటం వల్ల జీర్ణ సంబంధ సమస్యలతో పాటు అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. 

ధీర్ఘకాలంలో ఆర్గాన్స్ చెడిపోయే ప్రమాదం ఉంది. మరి, మన ప్రాణాలకు ముప్పు తెచ్చే నకిలీ బంగాళాదుంపల్ని గుర్తించటం ఎలా?..

మొదటగా వాటి వాసన చూడండి. కల్తీ కాని బంగాళాదుంపలు మట్టి వాసన వస్తాయి. అలా కాకుండా కెమికల్స్ వాసన వస్తే అవి కచ్చితంగా కల్తీ చేసినవే..

మీరు కట్ చేయగానే లోపల, బయట ఒకే రంగు ఉంటే అవి మంచివి. లేకపోతే కల్తీ చేసినట్లు అర్థం.

బంగాళాదుంపల్ని చేతితో రుద్దగానే పై తోలు ఈజీగా ఊడివస్తే అది కెమికల్స్‌తో కల్తీ చేసినదని గుర్తించండి.

నీటిలో వాటిని వేసినపుడు కెమికల్స్ కలిపిన బంగాళాదుంపలు ఆ కెమికల్స్ కారణంగా నీటిపై తేలే అవకాశం ఉంది.

సహజ సిద్ధమైన బంగాళాదుంపల తోలు రఫ్‌గా, పల్చగా ఉంటుంది. నకిలీ వాటికి అలా కాదు. తోలు చాలా మృదువుగా, మందంగా ఉంటుంది.