షుగర్ పేషెంట్స్‌కి గుడ్ న్యూస్.. పైసా ఖర్చు లేని సింపుల్ చిట్కా

ఆకు కూరలన్నింటిలో పోషకాలు ఉంటాయి.  వాటిలో గోంగూర ఒకటి. ఈ కూర పుల్ల పుల్లగా ఉండి పిల్లలు పెద్దలు అమితంగా ఇష్టపడతారు.

గోంగూరలో.. కాండం, ఆకు తొడిమలు, పువ్వుల్లో అనేక పోషకాలున్నాయి. గోంగూర పువ్వుల్లో బోలెడు పోషకాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతారు. 

ఈ కాయలు అధిక రక్తపోటు, గాయాలపై పూతలు, జలుబు నివారణకు వినియోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కండ్ల కలక చికిత్సకు వినియోగిస్తారు.

గోంగూర కాయలను ఆహారంలో భాగంగా చేసుకుంటే.. ఆరోగ్యానికి మంచిదంటారు. 

అలా తీసుకుంటే.. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువ.

షుగర్ పేషెంట్స్‌కు ఈ పువ్వు ఒక వరం.  గ్లాస్ వాటర్‌లో మూడు లేదా నాలుగు గోంగూర పువ్వులు వేసి బాగా మరిగించి.. ఆ నీటిని పరగడుపున తీసుకోవాలి. అలా షుగర్ స్థాయిలు అదుపులో వస్తాయి. 

గోంగూర పువ్వుతో చేసిన నీటిని రోజు పరగడుపున తాగితే అధిక బరువు సమస్య సైతం దూరమవుతుంది.

ఈ నీటితో రోగ నిరోధక శక్తి వృ‌ద్ధి చెందుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యలు తగ్గుతాయి.

గోంగూర పువ్వులను దంచి.. వాటి నుంచి అర కప్పు రసం తీసి.. అందులో అర కప్పు పాలు కలిపి తాగితే రేచీకటి సమస్య తగ్గుతుంది.

ఈ పువ్వులు వేసిన మరిగించిన నీటిని తీసుకోవడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు నయమవుతాయి. కిడ్నీలు సైతం శుభ్రమవుతాయి.

మొదడు పని తీరు మెరుగుపడుతుంది. జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది.

కంటి చూపు పెరుగుతుంది. చర్మం నిత్యం యవ్వనంగా, కాంతివంతంగా ఉంటుంది.