నాలుక శుభ్రం చేసుకోకుంటే.. ఈ రోగాలు గ్యారంటీ..

ప్రతి రోజు దంతాలు, నాలుకను శుభ్రం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

లేకుంటే.. దంతక్షయం, చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా నాలుకపై అధికంగా ఉంటుందంటున్నారు.

నాలుక శుభ్రం చేసుకుంటేనే ఆ బ్యాక్టీరియా పోతుందని చెబుతున్నారు. 

నాలుక పని.. మనం తినే ఆహారాన్ని రుచి చూడటం మాత్రమే కాదు, మన ఆరోగ్య సమస్యలను గురించి చెప్పే శక్తి కూడా దానికి ఉంది. 

ఎవరికైనా ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే.. వైద్యుడి వద్దకు వెళ్ళినప్పుడు.. వారు ముందుగా మీ నాలుకను పరీక్షిస్తారు.

ఎందుకంటే.. మీ నాలుక రంగు ఎలా ఉందో చూస్తారు. మీరు ఎలాంటి ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారో నాలుక  చెబుతుంది. 

సాధారణంగా.. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన నాలుక ఆరోగ్యంగా ఉండాలి.కాబట్టి మన నాలుక శుభ్రంగా లేకపోతే లేని పోని చిక్కుల్లో పడతాం.

తరచూ నాలుకను శుభ్రం చేయకుంటే విష పదార్థాలు పేరుకుపోతాయి. కాబట్టి ప్రతిరోజూ నాలుకను శుభ్రం చేయడం వల్ల శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది.

నాలుక శుభ్రం చేయకుంటే ఏం జరుగుతుందంటే..

అపరిశుభ్రమైన నాలుక.. కడుపులోని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నాలుక నల్లగా ఉండి, దానిపై తెల్లటి గడ్డలు ఉంటే, అది మీ జీర్ణవ్యవస్థలోని సమస్య  ఉందని సంకేతం.

మీ నాలుక మృదువుగా ఉంటే, అది ఐరన్ లోపాన్ని సూచిస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారని సూచిస్తుంది.

కొన్నిసార్లు ఈ లక్షణాలు విటమిన్ లోపం వల్ల కలుగుతాయి. ఇటువంటి సందర్భాల్లో.. తగినంత పోషకాలు, విటమిన్లు తీసుకోవడం అవసరం.

కొంతమందికి నాలుకలో పగుళ్లు ఉండటం గమనించవచ్చు.ఇది మూత్రపిండాల వ్యాధి, మధుమేహానికి సంకేతం కావచ్చు. ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.