మట్టి కుండలు కొనేటప్పుడు
ఈ జాగ్రత్తలు పాటించండి..
మట్టి కుండ కొనేముందు దాని రంగుపై దృష్టి పెట్టడం ముఖ్యం. నలుపు రంగు కుండ ఎంచుకోవడం మంచిది, ఎందుకంటే అందులో నీరు ఎక్కువ చల్లగా ఉంటుంది.
ఎరుపు రంగు కుండ కూడా తీసుకోవచ్చు, కానీ అది టెర్రకోటతో తయారైనది ఎంచుకోండి
పెయింట్ వేసిన కుండలను కొనొద్దు, ఎందుకంటే వాటిలోని రసాయనాలు నీటిలో కలిసి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
కొనే ముందు కుండలో నీళ్లు పోసి కొంత సమయం నేలపై ఉంచి చూడండి. నీరు కారితే ఆ కుండ నాణ్యత లేనిదని గ్రహించండి.
కుండలో నీళ్లు పోసి మట్టి వాసన వస్తుందో లేదో చూడండి. మట్టి వాసన వస్తే అది మంచి నాణ్యతతో తయారైందని అర్థం.
నీటిని ఎక్కువ సేపు చల్లగా ఉంచే మందమైన కుండను ఎంచుకోండి. పలుచని కుండలు తేలికగా పగిలిపోతాయి. అందుకే మందంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
Related Web Stories
సమ్మర్ లో పైనాపిల్ తినకూడదా.. తింటే ఏమౌతుంది..
పచ్చి బఠానీతో ఎంత ఆరోగ్యమో తెలుసా.. వీటిని తీసుకుంటే.. !
ఈ 7 డ్రై ఫ్రూట్స్కి మీ గుండె సేఫ్..!
రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల కలిగే ఉపయోగాలు ఇవే..