భారతీయ వంటకాల్లో ఆవ నూనె విరివిగా ఉపయోగిస్తుంటారు.

అయితే ఆవ నూనె ప్రమాదకరమని యూరప్ దేశాలు చెబుతున్నాయి.

ఈ మేరకు అమెరికా, కెనడా వంటి దేశాలు దీన్ని నిషేధించాయి.

ఈ నూనె ప్రమాదకరమని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చెబుతోంది.

దీనిలో ఎరుసిక్ యాసిడ్ అనే కొవ్వు ఆమ్లం అధిక మొత్తంలో ఉంటుంది.

ఈ ఎరుసిక్ యాసిడ్ జీవక్రియ, మెదడు కణాలపై ప్రభావం చూపుతుంది.

జ్ఞాపకశక్తి క్షీణత, మానసిక రుగ్మత, గుండె, కాలేయ ముప్పునకు దారితీస్తుంది.

శరీర ఎదుగుదల మందగించడం, బరువు తగ్గడం వంటి సమస్యలు వస్తాయి.

విరేచనాలు, కడుపు నొప్పి, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఎరుసిక్ యాసిడ్ పునరుత్పత్తిపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది.

అయితే తక్కువ ఎరుసిక్ యాసిడ్‌తో చేయబడిన ప్రాసెస్డ్ ఆవనూనె మంచిదే.