శాస్త్రవేత్తలు ఊపిరితిత్తుల వ్యాధి కేసులు వేగంగా పెరుగుతున్నట్లు కనుగొన్నారు

ముఖ్యంగా ఈ అలవాట్లు, రసాయనాల కారణంగా ఈ శ్వాసకోస వ్యాధికి గురవుతున్నట్లు నిర్ధారించారు.

పాప్ కార్న్ లంగ్ డిసీజ్ సోకితే శాశ్వతంగా నయమయ్యే అవకాశం లేదు.

పాప్ కార్న్ ఊపిరితిత్తుల వ్యాధిని వైద్యపరంగా బ్రోన్కియోలిటిస్ ఆబ్లిటెరాన్స్ అని పిలుస్తారు.

మైక్రోవేవ్ పాప్‌కార్న్, ఈ-సిగరెట్లు  కొన్ని ఆహారాల్లో వెన్న రుచిని రావడానికి ఉపయోగించే రసాయనం. దీన్ని పీల్చినట్లయితే ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది.

ఫార్మాల్డిహైడ్, క్లోరిన్, నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ డయాక్సైడ్ వంటి రసాయనాలు కూడా ఈ వ్యాధికి కారణమవుతాయి.

న్యుమోనియా లేదా బ్రోన్కైటిస్ వంటి కొన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఈ పరిస్థితిని రేకెత్తిస్తాయి.

రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ఊపిరితిత్తుల మార్పిడి తర్వాత శరీరం అవయవాన్ని తిరస్కరించినా కూడా ఈ వ్యాధి రావచ్చు.