ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోవద్దు.. క్యాన్సర్ కావొచ్చు.. బీకేర్‌ఫుల్

 మీరు ఎటువంటి కారణం లేకుండా వేగంగా బరువు తగ్గుతుంటే, అది ఆందోళన కలిగించే విషయం కావచ్చు.

విశ్రాంతి తర్వాత కూడా తగ్గని అలసట క్యాన్సర్ లక్షణం కావచ్చు.

చర్మంపై కొత్త పుట్టుమచ్చలు, నయం కాని పుండ్లు లేదా రంగులో మార్పులు (పసుపు రంగులోకి మారడం వంటివి) క్యాన్సర్ సంకేతాలు కావచ్చు.

తలనొప్పి, వెన్నునొప్పి లేదా కడుపు నొప్పి వంటి దీర్ఘకాలిక నొప్పి.

మలం లేదా మూత్రంలో రక్తం, క్రమరహిత ఋతుస్రావం లేదా దగ్గినప్పుడు రక్తం.. ఇవి ఊపిరితిత్తులు, పెద్దప్రేగు లేదా గర్భాశయ క్యాన్సర్ లక్షణం కావచ్చు.

ధూమపానం మానేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.