వర్షాకాలం వచ్చిందంటే చాలు టైఫాయిడ్ విజృంభిస్తుంది. చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలివాళ్ల వరకు దీని బారినపడుతూ ఉంటారు.
టైఫాయిడ్ అనేది సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం ద్వారా వ్
యాపిస్తుంది.
టైఫాయిడ్ వస్తే అధిక జ్వరం, కడుపు నొప్పి, తలనొప్పి, విరేచనాలు, అలసట, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
టైఫాయిడ్ లక్షణాలు కనిపించగానే డాక్టర్‌ను సంప్రదించటం ఉత్తమం.
డాక్టర్ల సలహా మేరకు టైఫాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. కన్ఫార్మ్ అయితే, డాక్టర్లు రాసిచ్చిన మందులు తప్పని సరిగా వాడాలి.
టైఫాయిడ్ వచ్చిన తర్వాత బాధపడ్డకంటే రాకుండా ఉండాలంటే ఈ పనులు కచ్చితంగా చేయండి.
కాచిన నీటిని లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగండి. స్ట్రీట్ ఫుడ్ తినకండి.
భోజనానికి ముందు, టాయిలెట్ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
టైఫాయిడ్ వ్యాక్సిన్ తప్పని సరిగా తీసుకోండి.
Related Web Stories
రక్తహీనత లేకపోయినా బలహీనంగా ఉన్నారా? అయితే.. అది ఇదే కావచ్చు..
ఖాళీ కడుపుతో నేరేడు విత్తనాల పొడి తీసుకుంటే..
గొంతులో గర గర వేధిస్తోందా? ఈ చిట్కాలతో బయటపడండి
తులసి గింజలను ఇలా వాడండి.. ఎన్నో సమస్యలు తగ్గుతాయి..