రక్తహీనత లేకపోయినా బలహీనంగా ఉన్నారా?  అయితే.. అది ఇదే కావచ్చు..

పురుషులతో పోలిస్తే మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.

మారుతున్న జీవనశైలి కారణంగా కొన్ని సమస్యలు టెస్ట్ చేయించుకున్నా కనిపెట్టలేం. ఇలాంటివి  చాలా ప్రమాదకరం కావచ్చు.

అలాంటి సమస్యల్లో ఒకటే హిడ్డెన్ ఎనీమియా. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ సవ్యంగా ఉన్నట్టే అనిపించినా శరీరంలో బలహీనత కొనసాగితే ఈ సమస్య ఉన్నట్టే లెక్క.

తగినంత ఆహారం తిన్నప్పటికీ బలహీనత లేదా అలసట కొనసాగితే హిడ్డెన్ ఎనీమియా కావచ్చు.

చర్మం పసుపు రంగులోకి మారడం, జుట్టు రాలడం లేదా గోర్లు బలహీనపడటం కూడా 'దాచిన రక్తహీనత' లక్షణాల్లో ఒకటి.

తరచుగా ఊపిరి ఆడకపోవడం లేదా మీ గుండె వేగంగా కొట్టుకున్నట్లు అనిపించడం. ఇలాంటి సందర్భాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి.

అలాంటి పరిస్థితి మీకూ ఉంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.