బ్యాక్ పెయిన్.. ఇలా చెక్ పెట్టండి..
బరువైన వస్తువులను పైకి ఎత్తేటపుడు నడుముపై కాకుండా మీ కాళ్లపై ఒత్తిడి పడేలా చూసుకోండి.
నిద్రపోయేటపుడు బోర్లా పడుక్కోకండి. కడుపుపై కాకుండా మీ వెన్నెముకకు మద్దతు ఇచ్చే భంగిమలో వెల్లకిలా పడుక్కోండి.
కండరాలను రిలాక్స్ చేయడానికి, రక్త ప్రవాహాన్ని పెంచడానికి, నొప్పిని తగ్గించడానికి హీటింగ్ ప్యాడ్ ఉపయోగించండి. లేదా వేడి నీటి స్నానం చేయండి.
కొవ్వు ఎక్కువగా ఉండే లేదా వేయించిన ఆహార పదార్థాలు కండరాల జీవక్రియను ప్రభావితం చేస్తాయి. వాపు, నొప్పికి దారి తీస్తాయి.
కండరాల అలసటను తగ్గించడానికి వీలైనప్పుడల్లా మంచినీరు తాగుతూ ఉండండి. శరీరంలో నీటి శాతం తగ్గితే నొప్పులు మొదలవుతాయి.
మీ శరీర బరువును నియంత్రణలో ఉంచుకోండి. అధిక బరువు వెన్నెముక, కండరాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.
తేలికైన వ్యాయామాలు లేదా యోగా చేయండి. ముఖ్యంగా స్ట్రెచింగ్ వ్యాయామాలు వెన్ను నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
ప్రతిరోజూ తగినంత శారీరక శ్రమ చేయడం ద్వారా మీ వెన్నెముకను, వెనుక కండరాలను బలపరుచుకోవచ్చు. కూర్చునేటపుడు సరైన భంగిమలో కూర్చోవడం కూడా ముఖ్యం.
Related Web Stories
సాంబార్‌ను తేలిగ్గా తీసుకున్నారా.. ఈ విషయాలు తెలిస్తే..
మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే.. రాగి సంగటి తినవచ్చా..?
చలికాలంలో హృద్రోగులకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
కాఫీలో నెయ్యి వేసుకొని తాగితే మంచిదేనా?