చలికాలంలో హృద్రోగులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువ అవుతుందని వైద్యులు చెబుతారు.

చలితో రక్తనాళాలు కుంచించుకుపోవడం, రక్తం చిక్కబడటం వంటివి రిస్క్‌ను పెంచుతాయి.

హృద్రోగులు చలి బారిన పడకుండా స్వెటర్ వంటి వాటిని తప్పనిసరిగా ధరించాలి

శారీరక శ్రమ పెరిగితే గుండెపై ఒత్తిడి అధికం అవుతుంది. కాబట్టి శీతాకాలంలో జాగ్రత్తగా ఉండాలి

చలితో బీపీ అకస్మాత్తుగా పెరిగే ఛాన్సుంది. కాబట్టి నిత్యం రక్తపోటుపై ఓ కన్నేసి ఉంచాలి

ఈ కాలంలో ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం ఫ్లూ షాట్స్ తీసుకోవడం అవసరం

ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ కాలంలో మద్యపానానికి దూరంగా ఉండాలి

ఛాతిలో నొప్పిగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదిస్తే ముప్పు నుంచి ఆదిలోనే తప్పించుకోవచ్చు