మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే.. రాగి సంగటి తినవచ్చా..?
రాగి సంగటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
వీటిలో కాల్షియం, ఐరన్, ప్రోటిన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
దీనిలో కాల్షియం, విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల ఎముకలు బలపడతాయి. విటమిన్ డీ లోపాన్ని తగ్గిస్తుంది.
కొలెస్ట్రాల్, సోడియం స్వల్పంగా ఉంటుంది. మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది. రక్తపోటును నియంత్రిస్తుంది.
వీటిలో ఐరన్, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
ఉదయం అల్పాహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
రాత్రిపూట తినడం అంత మంచిది కాదు. జీర్ణ సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండడం మంచిది.
మూత్రపిండాల్లో రాళ్లు లేదా మూత్ర విసర్జన సమస్యలతో ఇబ్బంది పడే వారు.. వైద్యుని సలహా సూచనలు తీసుకొని వీటిని తీసుకోవాలి.
Related Web Stories
చలికాలంలో హృద్రోగులకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
కాఫీలో నెయ్యి వేసుకొని తాగితే మంచిదేనా?
పల్లీలు మంచిది తింటున్నారా, పొరపాటున కూడా తినొద్దు
బెండకాయల గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలివి!