డైలీ ఈ కూరగాయలు తింటే త్వరగా బరువు తగ్గుతారు..!

కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికం. ఇవి పోషకాల నిధులు. బరువు తగ్గేందుకు బెస్ట్ ఛాయిస్.

పాలకూరలో ఇనుము, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. శరీరానికి మంచి శక్తి లభిస్తుంది.

బ్రోకలీలో జీర్ణక్రియను మెరుగుపరిచే విటమిన్ సి, కె, ఫైబర్‌లు ఉంటాయి.

క్యాప్సికమ్‌లో విటమిన్ ఎ, సి లు అధికం. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

చిలగడదుంపలు నెమ్మదిగా జీర్ణమవుతాయి. మంచి శక్తి లభిస్తుంది. కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌ ఎక్కువ.

టమోటాల్లో గుండె జబ్బులు, క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడే లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది.

బీన్స్ తింటే ఎక్కువసేపు కడుపునిండిన అనుభూతి కలుగుతుంది. ప్రోటీన్, ఫైబర్ మెండు.

సొరకాయ తక్కువ కేలరీలు ఉన్న కూరగాయ. బరువు నియంత్రణలో సహాయపడుతుంది.

దోసకాయ హైడ్రేషన్ తగ్గిస్తుంది. అధిక నీటి శాతం ఉండటం వల్ల ఇవి తింటే ఆకలి నియంత్రణలో ఉంటుంది.