క్యాన్సర్‌ కణాలను నియంత్రించే సింపుల్ చిట్కా..

యాంటీ - ఆక్సిడెంట్లు మొలకెత్తిన వెల్లుల్లిలో అధికంగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.

ఆహారంలో వెల్లుల్లిని తీసుకోవడం వల్ల వృద్ధాప్య ప్రభావాన్ని నివారించవచ్చు. శరీరంపై ముడతలు, మొటిమల సమస్యను సైతం అధిగమించ వచ్చు. 

ప్రతి రోజు.. మొలకెత్తిన వెల్లుల్లిని తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

వీటిని తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు, వైరస్‌లకు దూరంగా ఉండవచ్చు. మొలకెత్తిన వెల్లుల్లి వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.

ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌‌ను తగ్గిస్తుంది. ఇది రక్త సరఫరాను సైతం మెరుగుపరుస్తుంది.

వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్ల వల్ల శరీరంలో క్యాన్సర్‌ కణాలు పెరగకుండా చేస్తాయి. ఇది మెదడు పని తీరును మెరుగు చేస్తుంది.

మొలకెత్తిన వెల్లుల్లిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

మొలకెత్తిన వెల్లుల్లిలో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇది ధమనులను వ్యాకోచింప జేసి.. రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపడుతుంది.

మొలకెత్తిన వెల్లుల్లిలో ఎంజైమ్ మూలకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.