బంగాళాదుంపలు తెగ తింటున్నారా   ఆలూ అతిగా తింటే డేంజర్!

బంగాళదుంపలు రుచికరంగా ఉండటంతో చాలా మంది ఎక్కువగా తినడానికి ఇష్టపడుతారు. అయితే ఇవి అధికంగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు.

  ప్రతిరోజూ బంగాళదుంపలతో చేసిన వంటకాలను తీసుకుంటే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి

   బంగాళదుంపలు అతిగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.

  అలూ చిప్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల హై బీపీ బారిన పడే అవకాశం ఉంది.

   అలుగడ్డలో ఉండే కార్బోహైడ్రేట్ కీళ్లనొప్పులను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

  బంగాళదుంపలను అధికంగా తింటుంటే.. దాని వల్ల మీరు అలెర్జీకి గురయ్యే అవకాశం ఉంటుందట.

బరువు, జీర్ణకోశ సమస్యలు, రక్తపోటు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు వీటిని నియంత్రిత పరిమాణంలో మాత్రమే తీసుకోవడం మంచిది.