క్రాన్ బెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

క్రాన్ బెర్రీలు ప్రతీరోజూ తినడం వల్ల మూత్రాశయ సంబంధ సమస్యలు తగ్గుతాయి. 

క్రాన్ బెర్రీలలోని అధిక స్థాయి యాంటీఆక్సిడెంట్లు కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. 

క్రాన్ బెర్రీస్ గుడ్ బ్యాక్టీరియాను ప్రమోట్ చేస్తాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

క్రాన్ బెర్రీస్ నోటిలో యాసిడ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. పళ్లు పుచ్చిపోకుండా అడ్డుకుంటాయి. చిగుళ్ల సమస్యలు రావు. 

క్రాన్ బెర్రీస్‌లో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది. 

క్రాన్ బెర్రీస్ ప్రతీ రోజూ తినటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

కిడ్నీ సంబంధ సమస్యలు ఉన్నవారు. గర్భిణిలు, పసి పిల్లల తల్లులు, కొన్ని రకాల మందులు వాడుతున్న వారు వైద్యుల సలహా మేరకే క్రాన్ బెర్రీ తినాలి.