ఈ లక్షణాలు ఉన్నాయా..
డెంగ్యూ ఉన్నట్లే జాగ్రత్త!
డెంగ్యూ అనేది దోమల కాటు ద్వారా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్. వర్షాకాలంలో డెంగ్యూ కేసులు వేగంగా పెరుగుతాయి.
మొదట్లో ఇది సాధారణ జ్వరంలా అనిపించవచ్చు. కానీ సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే అది ప్రమాదకరం కావచ్చు.
డెంగ్యూ అనేది అకస్మాత్తుగా తీవ్రతరం అవుతుందంట. దీని వలన తీవ్రమైన తలనొప్పి, వాంతులు, తల తిరగడం, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నిరంతరం వాంతులు అవుతున్నా, గంటలు గడుస్తున్నా వాంతులు అనేవి తగ్గకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలంట.
డెంగ్యూ వ్యాధి సోకితే,తీవ్రమైన కడుపు నొప్పి ఉంటుందంట. తరచుగా ఇలానే కడుపు నొప్పి ఉంటే తప్పక డెంగ్యూ టెస్ట్ చేయించుకోవాలంట.
విపరీతమైన అలసట, నడవ లేకపోవడం, మీ శరీరం చాల అలసిపోయినట్లు, ఏదీ తట్టుకోలేని విధంగా ఉంటే, అది డెంగ్యూ ప్రారంభ సంకేతం కావచ్చు అంటున్నారు వైద్యులు.
చిగుళ్లు లేదా ముక్కు నుంచి రక్త స్రావం, ఒక్కసారిగా తల తిరిగినట్లు అనిపించడం, మైకం కమ్మడం, విపరీతమైన ఫీవర్ డెంగ్యూ లక్షనాలంట.
Related Web Stories
పాలు, గుడ్లు కలిపి తాగితే శరీరంలో జరిగే మార్పులివే..
ఈ పళ్లు.. షుగర్ లెవెల్స్ పెంచేస్తాయి!
కరివేపాకు నమలడం వల్ల కలిగే 5 అద్భుత ప్రయోజనాలు!
కళ్లు పొడిబారడాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసా?