కళ్లు పొడిబారడాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసా?

స్మార్ట్‌ ఫోన్, కంప్యూటర్లు చూడటం వల్ల కంటి సమస్యలు వస్తున్నాయి

కళ్లు తరచూ పొడిబారుతుంటాయి

కళ్లు దురద, నీరు కారడం, ఎర్రగా మారడం వంటివి కళ్లు పొడిబారడం లక్షణాలు

కళ్లపై ఉండే టియర్ ఫిల్మ్ ప్రభావితం కావడం వల్లే కళ్లు పొడిబారతాయి

కంటిలో ఉన్న మూడు లేయర్లలో మార్పులు వస్తే కళ్లు పొడిబారడం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు

కళ్లకు తగినంత నిద్ర అవసరం

గోరువెచ్చని నీటితో కనురెప్పలను శుభ్రం చేసుకోవాలి

క్యారెట్, బచ్చలికూర, కాలే, చిలకడదుంప, రెడ్ క్యాప్సికమ్ వంటి ఆహారాన్ని తీసుకోవాలి