నానబెట్టిన వాల్‌నట్స్ VS  నానబెట్టిన బాదం  ఏది ఆరోగ్యానికి మంచిది..

వాల్నట్స్ ను సాధారణంగా బ్రెయిన్ ఫుడ్‍గా పిలుస్తారు. ఇందులో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

నానబెట్టిన వాల్నట్స్ తింటే మెదడు పనితీరు మెరుగవుతుంది.

వాల్నట్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే సామర్థ్యం కలిగి ఉంటాయి. టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఇవి చాలా మంచివి.

బాదం పప్పులో విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.

నానబెట్టిన బాదం పప్పును ఆయుర్వేదంలో మెదడు టానిక్‌గా పరిగణిస్తారు. ఇది జ్ఞాపకశక్తి దృష్టిని పదునుపెడుతుందని నమ్ముతారు.

నానబెట్టిన బాదం, నానబెట్టిన వాల్‌నట్స్ రెండూ కూడా ఆరోగ్యానికి మంచివే.

కానీ ఆరోగ్యకరమైన ఎంపిక వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది.