హై బీపీని కంట్రోల్ చేసే సూపర్ సింపుల్ ఫుడ్స్ ఇవే..
ప్రస్తుతం హై బీపీ అందరిని ఇబ్బంది పెడుతున్న సమస్య.. దీనిని తగ్గించేందుకు ఈ ఆహార పదార్థాలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మొదటిది కీర దోసకాయ. బీపీని నియంత్రించడానికి ఇది చాలా బాగా పని చేస్తుంది. కీర దోస.. కేజీ ఖరీదు కూడా స్వల్పంగానే ఉంటుంది.
దీనిని తీసుకోవడం ద్వారా సులభంగా హై బీపీ సమస్య నుంచి బయట పడవచ్చు.
రెండోది రాతి ఉసిరి (ఆమ్లా). ఇందులో ఎన్నో పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఇది సహజ సిద్ధంగా లభిస్తుంది.
దీని వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేస్తుంది. అంటే శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది.
రాతి ఉసిరి.. షుగర్, హై బీపీలను తగ్గించడమే కాకుండా.. బరువు తగ్గడంలో సైతం కీలకంగా వ్యవహరిస్తోంది.
మూడోవది అన్ని కూరగాయలు.. మరి మఖ్యంగా బెల్ పెప్పర్స్(సిమ్లా మిర్చి).
ఇందులో పసుపు, ఎరుపు, పచ్చని రంగుల్లోని బెల్ పెప్పర్ తీసుకోవచ్చు. అలాగే క్యారెట్ సైతం బీపీ తగ్గడానికి సహాయపడుతుంది.
నాలుగోది.. ముల్లంగి (ర్యాడిష్) ఇది కొద్దిగా ఘాటుగా ఉంటుంది. అందుకే దీనిని తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ కూరగా చేసుకుని తీసుకుంటే మంచిది.
ఐదోవది.. మజ్జిగ (బటర్ మిల్క్). చాలా పల్చగా చేసుకుని తాగాలి. అందులో కొద్దిగా జీలకర్ర పొడితోపాటు సొంపు పొడి వేసుకుని తీసుకుంటే వెంటనే రిలీఫ్ ఉంటుంది. పేగులు సైతం ఆరోగ్యంగా ఉంటాయి.
ఆరోవది.. రాత్రి గ్లాస్ వాటర్ తీసుకోవాలి. టీ స్పూన్ సొంపు, జీలకర్ర, ఒక దాల్చిన చెక్కను నీటిలో నాన బెట్టాలి. ఉదయం అందులో పొదినా వేయాలి.
వీటికి ఆఫ్ స్ఫూన్ ములగాకు పొడి వేసి బాగా మరిగించాలి. అనంతరం వడ చేసుకుని.. అందులో నిమ్మకాయ పిండుకుని తాగితే.. బీపీ వెంటనే కంట్రోల్ అవుతుంది.